ETV Bharat / state

గిడ్డంగుల మార్కెట్‌కు హైదరాబాద్‌ సానుకూలం - నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వార్తలు

హైదరాబాద్‌లో గిడ్డంగుల మార్కెట్‌కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రాపర్టీ కన్సెల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. దేశంలో 8 ప్రధాన నగరాల్లో వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌ స్థితిగతులను విశ్లేషిస్తూ ఆ సంస్థ ‘ఇండియా వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌ 2020’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఆయా నగరాల కన్నా హైదరాబాద్‌కు అధిక విస్తరణ సామర్థ్యం ఉన్నట్లు పేర్కొంది.

hyderabads warehouse
hyderabads warehouse
author img

By

Published : Jul 3, 2020, 10:54 AM IST

గిడ్డంగుల మార్కెట్‌కు హైదరాబాద్‌లో అవకాశాలు ఎక్కువున్నాయని ప్రాపర్టీ కన్సెల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా పేర్కొంది. దేశంలో 8 ప్రధాన నగరాల్లో వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌ స్థితిగతులను విశ్లేషిస్తూ ఆ సంస్థ ‘ఇండియా వేర్‌హౌసింగ్‌ మార్కెట్‌ 2020’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఆయా నగరాల కన్నా హైదరాబాద్‌కు అధిక విస్తరణ సామర్థ్యం ఉన్నట్లు పేర్కొంది.

నిల్వ సామర్థ్యం ప్రస్తుత 13 మిలియన్‌ చదరపు అడుగుల స్థాయి నుంచి 29 మిలియన్‌ చ.అడుగులకు పెరిగే అవకాశం ఉందంది. దీనికి కారణం గిడ్డంగులకు 1,291 ఎకరాల భూములను కేటాయించడమే అని పేర్కొంది. ‘‘హైదరాబాద్‌ 2017-20 ఆర్థిక సంవత్సరాల్లో 41 శాతం వార్షిక సగటు వృద్ధిరేటును నమోదు చేసింది. మేడ్చల్‌, పటాన్‌చెరు, శంషాబాద్‌ క్లస్టర్లలో గిడ్డంగుల కార్యకలాపాలు అధికం. ఈ ఆర్థిక సంవత్సరంలో సింహభాగం కార్యకలాపాలు (87శాతం) మేడ్చల్‌ క్లస్టర్‌లోనే సాగాయి’’ అని వివరించింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.