ETV Bharat / state

Telangana Weather report: రాగల రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు - వాతావరణం తాజా వార్తలు

Telangana Weather report: రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా సూర్యుడి తాపానికి గురవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. రాగల రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వాతావరణం
వాతావరణం
author img

By

Published : May 17, 2022, 3:15 PM IST

Telangana Weather report: నైరుతి రుతుపవనాలు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర -దక్షిణ ద్రోణి ఒకటి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సుమారు 900మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. దీనిప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కొన్ని జిల్లాల్లో 30నుంచి 40కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. నిన్న రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

ఇదీ చదవండి: 'ఫాంహౌస్​లో కేసీఆర్.. ధాన్యం కుప్పల వద్ద రైతుల పడిగాపులు'

పాపం గజరాజు.. వరద ధాటికి నదిలో కొట్టుకుపోతూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.