hyderabad water supply : పైపు లైన్ల మరమ్మతుల కారణంగా హైదరాబాద్ జంట నగరాల్లో పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ప్రకటించింది. ఈనెల 8తేదీ ఉదయం 6 గంటల నుంచి 9తేదీ ఉదయం 6 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రజలు గమనించాలని జలమండలి వెల్లడించింది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు
మిరాలం, కిషన్‌బాగ్, అల్ జుబైల్ కాలనీ, సంతోష్‌నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకూత్‌పురా, మాదన్నపేట, మహబూబ్ మాన్షన్, రియాసత్‌నగర్, ఆలియాబాద్, బొగ్గులకుంట, అప్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్, బొంగుళూరు, మన్నెగూడలో అంతరాయం కలగనుంది.
ఇదీ చూడండి: Corona in medical college: వైద్య కళాశాలలో కొవిడ్ కలకలం.. 39 మందికి పాజిటివ్