హైదరాబాద్ కమిషనరేట్‌లోని 25 ఠాణాల పరిధిలో శుక్రవారం సర్వే నిర్వహించారు. గంట వ్యవధిలో సగటున వెయ్యిమందిని ప్రశ్నించగా ఎక్కువ మంది బ్యాంక్‌లకు వెళ్తున్నామని, తమ ఇళ్ల సమీపంలోని మందుల దుకాణాల్లో మందులు లేనందున వేరే ప్రాంతంలో కొనేందుకు వస్తున్నామని తెలిపారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న బేగంపేట పోలీసులు 1180 మంది వాహనదారుల నుంచి వివరాలు సేకరించారు. మందులు కొనేందుకు, చికిత్సలకు 336 మంది, బ్యాంక్‌లకు 260, పాసులున్న వాహనదారులు 125, పోలీసులు, మీడియా ప్రతినిధులు 103, నిర్మాణరంగం 82, రెవెన్యూ, డిఫెన్స్, పౌరసరఫరాలు 73, జీహెచ్‌ఎంసీ 43, మద్యం కొనేందుకు 10 మంది ఉన్నారు. ఇక ఏ కారణం చెప్పనివారు, ఉల్లంఘనులు 148 మంది.