Hyderabad Tops Stolen Mobiles Recovery : చోరికి గురైన లేక ఎక్కడైనా పడిపోయిన చరవాణీలను గుర్తించి తిరిగి వాటిని ఫిర్యాదుదారులకు అప్పగించడంలో హైదరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సీఈఐఆర్ పోర్టల్‌లో దాదాపు 35 శాతంతో భాగ్యనగరం పోలీసులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ తొలి వారం వరకూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 59వేల 638 ఫోన్లు బ్లాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Telangana Tops Lost Mobiles Recovery : పోగొట్టుకున్న లేదా దొంగిలించిన ఫోన్ల ఆచూకీ గుర్తించి బాధితులకు అప్పగించడంలో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకత చాటుతున్నారు. ఫొన్లను యజమానులకు అప్పగించడంలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు తొలి స్థానాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
సెల్ ఫోన్ పోగొట్టుకున్న యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా నేరుగా సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే ఫోన్ బ్లాక్ చేస్తున్నారు. చోరికి గురైన ఫోన్‌లో కొత్త సిమ్‌కార్డు వేసిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌కి సందేశం వస్తుంది. దాని ఆధారంలో ప్రస్తుతం ఫోన్ వినియోగిస్తున్న వారి వివరాలకు గుర్తించి ఫోన్ స్వాధీనం చేసుకుని ఫిర్యాదుదారులకు అందిస్తున్నారు.
How To Find Lost Mobile : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. టెన్షన్ ఎందుకు.. 'సంచార్ సాథీ' తోడు ఉందిగా!
Hyderabad Police Recovered Mobile Phones : ఏప్రిల్ 20 నుంచి డిసెంబరు తొలివారం వరకూ మూడు కమిషనరేట్లలో 59వేల 638 ఫోన్లు బ్లాక్ చేశారు. వీటిలో 22 వేల103 ఫోన్ల ఆచూకీ గుర్తించారు. 5 వేల 32 ఫోన్లను యజమానులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14వేల23 ఫోన్లు యజమానులకు అందించగా అందులో 35 శాతం రాజధానిలో ఉండడం గమనార్హం.
కొన్నిసార్లు నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఆలస్యంగా స్పందించడం ఇతర సాంకేతిక కారణాలతో రికవరీ ప్రక్రియ సుధీర్ఘంగా సంక్లిష్టంగా ఉండేది. ప్రస్తుతం సీఈఐఆర్ పోర్టల్ ద్వారా క్షణాల్లో తప్పిపోయిన చరవాణీల ఆచూకీ గుర్తించడం సులభమైంది. అందులోని రాజధాని పోలీసులు సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటున్నారు.
CEIR Mobile Tracker Telangana 2023 : మీ మొబైల్ చోరికి గురైన లేక ఎక్కడైనా పడిపోయినపుడు ఎవరైనా సిమ్ వేస్తే వెంటనే టెలికాం ఆపరేటర్ల ద్వారా సీఈఐఆర్ పోర్టల్‌తో పాటు సెల్‌ఫోన్ యజమానికి సందేశం వెళ్తుంది. సెల్‌ఫోన్‌ను ఉపయోగించే వ్యక్తి సిమ్‌కార్డు నెంబర్‌తో పాటు ఎక్కడ వినియోగిస్తున్నారనే వివరాలు పోర్టల్ ద్వారా పోలీసులకు తెలిసిపోతుంది. జాతీయస్థాయిలో సెల్‌ఫోన్ రికవరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ తొలి వారం వరకూ హైదరాబాద్‌లో 59వేల 638 ఫోన్లు బ్లాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు
మొబైల్ ఫోన్ పోయిందా? ఆన్లైన్లో సింపుల్ రిక్వెస్ట్‌తో బ్లాక్! సిమ్ మార్చినా నో ఛాన్స్!!