ETV Bharat / state

భార్యా పిల్లలకు విషమిచ్చి... తానూ తనువుచాలించాడు

author img

By

Published : Mar 3, 2020, 1:02 AM IST

Updated : Mar 3, 2020, 1:26 PM IST

ఆర్థిక సమస్య ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. కుంగుబాటు నిండు జీవితాలను కాటేసింది. అభంశుభం తెలియని చిన్నారులు... తల్లిదండ్రులతో పాటే కాలగర్భంలో కలిసిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడం పట్ల బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రికి భారమవుతున్నానంటూ ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి భార్యాబిడ్డలకు విషమిచ్చి తానూ తనువు చాలించిన దుర్ఘటన వనస్థలిపురం పరిధి హస్తినాపురంలో కలకలం సృష్టించింది.

hyderabad techie  suicide
భార్యా పిల్లలకు విషమిచ్చి... తానూ తనువుచాలించాడు

భార్యా పిల్లలకు విషమిచ్చి... తానూ తనువుచాలించాడు

హైదరాబాద్​ వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు.

తెలియకుండా విషం పెట్టి... రోజంతా అక్కడే ఉండి

ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రదీప్‌.. స్థానిక సంతోషిమాత కాలనీలో ఉంటున్నాడు. శనివారం కరీంనగర్​లో ఓ వేడుకకు వెళ్తున్నామని చెప్పి భార్య పిల్లలతోనే ఇంట్లోనే ఉండిపోయాడు. అదేరోజు రాత్రి భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు కల్యాణ్‌ కృష్ణ, జయకృష్ణకు తెలియకుండా ఆహారంలో విషం కలిపి ఇచ్చాడు. వారు చనిపోయిన అనంతరం రోజంతా వారి శవాల వద్దే ఉన్న ప్రదీప్‌.. ఆ తర్వాత తాను విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన ఫోన్​తో పాటు తన భార్య ఫోన్​లోని వాట్సప్ గ్రూపుల్లో నుంచి డిలీట్ అయ్యాడు.

బంధువుల సమాచారంతో..

శనివారం నుంచి వారు ఇంట్లోంచి బయటకు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఫోన్‌ చేసినప్పటికీ ఎంతకీ స్పందించకపోవడం వల్ల.. బంధువులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించగా.. నలుగురు విగతజీవులుగా కనిపంచారు. ఆర్థిక ఇబ్బందులతోనే ప్రదీప్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. చదువులో చురుకుగా ఉండే ప్రదీప్ భార్య స్వాతి ఎమ్మెస్సీలో గోల్డ్ మెడలిస్ట్. కాగా రెండేళ్ల క్రితం హస్తినాపురంలోని సంతోషిమాతకాలనీలోనే ప్రదీప్‌కుమార్‌ ఇల్లు నిర్మించుకున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

తండ్రికి లేఖ రాసిపెట్టి..

ఆత్మహత్య చేసుకునే ముందు ప్రదీప్‌ తన తండ్రికి లేఖ రాశాడు. నాన్నకు భారం కాలేనంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘నాన్నా నన్ను క్షమించు.. నేను నిన్ను విడిచిపెట్టి పోతున్నా. నా పిల్లలు కూడా నీకు భారం కావొద్దని వారినీ తీసుకెళ్తున్నా. నిన్ను పోషించే వయస్సులో ఇబ్బందులకు గురిచేసి వెళ్తున్నా. నన్ను క్షమించు’ అంటూ లేఖలో పేర్కొన్నట్లు ప్రదీప్‌ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు ఈ లేఖను స్వాధీనం చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రదీప్​కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

Last Updated : Mar 3, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.