హైదరాబాద్ నగర శివార్లలో ఆర్టీసీ బస్సులను అధికారులు పునరుద్ధరించారు. శివారు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల సౌకర్యార్థం గ్రేటర్ ఆర్టీసీ మఫిసియల్ బస్సులను తిప్పుతోంది. 135 రూట్లలో... 230 ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నామని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు.
సిటీ బస్సులు ఇంకా రోడ్డెక్కలేదని ఆయన స్పష్టం చేశారు. వీటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బస్సులను అర్బన్ ఏరియాకి 15 కి.మీల దూరంలో తిప్పుతున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సిటీ బస్సుల కోసం ఎదురుచూస్తున్న నగరవాసులు