ETV Bharat / state

మనసు లాగుతోంది.. మత్తు కోరుతోంది..!

కరోనా కారణంగా ఎక్కడికక్కడ అన్ని పనులు నిలిచిపోయినా మత్తు పదార్థాల సరఫరా మాత్రం ఆగలేదు. ఎప్పటిలాగే కావాల్సిన చోటికి వీటిని చాకచక్యంగా చేరవేస్తున్నారు కొందరు వ్యక్తులు. నగరంలో కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా సాగిన ఈ దందా అందరినీ ఈ వైపు లాక్కొని బానిసల్ని చేసింది. దీనికి ఆకర్షితులైన యువత ఎలాగైనా పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : May 9, 2020, 9:35 AM IST

హైదరాబాద్​లోని ముషీరాబాద్‌లో ఉండే ఓ యువకుడు లాక్‌డౌన్‌ వల్ల బోర్‌ కొడుతుంది.. ఎలాగైనా దమ్ము కొట్టాల్సిందేనంటూ.. అల్వాల్‌లోని తన మిత్రుడికి ఫోన్‌ చేశాడు. సాయంత్రం లోపు నీ చేతిలో ‘సరకు’ ఉంటుందని బదులిచ్చిన మిత్రుడు... చెప్పినట్లే రాత్రికి ఆ యువకుడికి దాన్ని చేరవేశాడు. నగరంలో లాక్‌డౌన్‌ ఉన్నా.. దూల్‌పేటకు చెందిన ఓ యువకుడి ద్వారా ఆ సరకు అల్వాల్‌కి చేరింది. అక్కడి నుంచి సాయంత్రానికి ముషీరాబాద్‌కి చేర్చాడు ఈ మిత్రుడు. అంతటా పోలీస్‌ చెకపోస్టులున్న నేపథ్యంలో ఆ పొట్లాలను షూ లోపల పెట్టి ఒకరికొకరు చేతులు మార్చుకున్నారు.’

అబ్బాయిలు... అమ్మాయిలూ...

వీటి తయారీకి, సరఫరాకి ప్రధాన కేంద్రాలుగా దూల్‌పేట, గోల్కొండ పరిధిలోని లక్ష్మీనగర్‌, బోయిన్‌పల్లి, బాలానగర్‌, ఫతేనగర్‌ మారాయి. ఇక్కడి నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు గంజాయి చేరుతోంది. కళాశాలల్లో ఒకరి నుంచి ఒకరికి అలవాటు కావడం వల్ల అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా గంజాయి కొడుతున్నారు. అమ్మాయిలు సైతం ప్రత్యేక కోడ్‌ భాష ద్వారా చర్చలు చేసుకుంటున్నారు.

భారీగా డిమాండ్‌...

లాక్‌డౌన్‌ కారణంగా వీటి సరఫరా ఆగిపోవడంతో పాటు, డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. గతంలో వంద గ్రాములు రూ.300 అమ్మిన గంజాయి పొట్లాలను ఇప్పుడు అదే వంద గ్రాములు రూ.1000కి అమ్ముతున్నారు. మత్తుకు బానిసైన యువత.. ఎంత పెట్టైనా కొనేందుకు వెనుకాడడం లేదు.

ఒత్తిడి పెరగడం వల్లే...

లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకునేవాళ్లూ దీని వైపు అడుగులేస్తున్నారు. కొత్త మత్తుకు అలవాటు అవుతున్నారు.

- కల్యాణ్‌చక్రవర్తి, మానసిక వైద్య నిపుణుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.