ETV Bharat / state

కృత్రిమ మేధ - విద్య, ఉద్యోగావకాశాలపై వెబినార్​

author img

By

Published : Oct 7, 2020, 8:48 PM IST

కృత్రిమ మేధ విద్య, ఉద్యోగావకాశాలు అనే అంశంపై హైసియా ఆధ్వర్యంలో.. అక్టోబర్​ 9వ తేదీన వెబినార్​ నిర్వహించనున్నారు. ఈ రంగంలో కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలను వక్తలు వివరించనున్నారు.

hyderabad-software-enterprises-association-webinar-on-october-9th
కృత్రిమ మేధ - విద్య, ఉద్యోగావకాశాలపై వెబినార్​

హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ విద్య, ఉద్యోగావకాశాలు’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగాల వేటలో ఉన్నవారు, ఐటీ నిపుణులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు- ఉద్యోగులు తదితర వర్గాల వారికి ఇది ఎంతో ఆసక్తికరమైన అంశం. ఈ రంగంలో ఏం జరుగుతోంది? కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలను ఈ వెబినార్‌లో వివరించనున్నారు.

ఈ కార్యక్రమం అక్టోబర్​ 9వ తేదీన... ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. వెబినార్​లో ఐటీ సెక్రటరీ జయేశ్​ రంజన్, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, హైసియా ఫౌండర్ జీఆర్​ రెడ్డి, ఐఐఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ వక్తలుగా పాల్గొననున్నారు. ఇన్​సైడ్ వ్యూ టెక్నాలజీస్ ఇంక్ బోర్డు మెంబర్ శేషారావు సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. సీట్ల సంఖ్య పరిమితం కావడంతో త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని హైసియా సభ్యులు సూచించారు. వెబినార్​లో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్​ కోసం ఇక్కడ క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి.

ఇదీ చూడండి: బాసర ఐఐఐటీ పీయూసీ-2 పరీక్షలకు షెడ్యూల్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.