ETV Bharat / state

వరుణాగ్రహం... భాగ్యనగరంలో లోతట్టుప్రాంతాలు జలమయం - HYDERABAD RAINS OVERALL UPDATES

వరుణుడి ప్రకోపానికి హైదరాబాద్​ మహానగరం అల్లాడుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షానికి  రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి... లోతట్టు ప్రాంతాలవాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. వారికి సాయం చేసేందుకు అధికారులు పడవల్లో వెళ్లారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

hyderabad-rains-overall-updates
author img

By

Published : Sep 27, 2019, 11:19 PM IST

భాగ్యనగరంలో బీభత్సం సృష్టించిన వర్షం....

భాగ్యనగరం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైపోయింది. వరద నీరు ఇళ్లలోకి చేరి... లోతట్టు ప్రాంతా వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. సికింద్రాబాద్​, మల్కాజిగిరి,అల్వాల్​, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆసిఫ్​ నగర్​, మాదాపూర్​, జూబ్లీహిల్స్, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు నెలకొరిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. సికింద్రాబాద్​, మల్కాజిగిరి, అల్వాల్ సమీపంలోని కొన్ని కాలనీలలో అడుగు బయటపెట్టే అవకాశం లేని పరిస్థితి.

పడవుల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి...

భారీవర్షంతో మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్, ఎన్​ఎమ్​డీసీ కాలనీ, రాజనగర్, పటేల్ నగర్​లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై సుమారు మోకాలు లోతు వరకు నీరు చేరాయి. చాలావరకు ఇళ్లలోకి నీరు చేరడం వల్ల.. వారంతా భవనాల పైకి ఎక్కి తలదాచుకోవాల్సి వచ్చింది. వర్షాలు తమకు శాపంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం గ్రేటర్ సిబ్బంది వారికి పాలు, మంచినీరు అందించారు. వీటిని ఇచ్చేందుకు అధికారులు పడవల్లో రావాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రోడ్లపై వరద.. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్​ జాం

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు నగరవాసి జీవితాన్ని నరకం చేశాయి. ఉదయం కురిసిన వర్షం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. కూకట్​పల్లి, మదాపూర్​, హైటెక్​సిటీ వైపు వెళ్లే సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. కిలోమీటరు ప్రయాణానికి దాదాపు గంట సమయం పట్టింది. ట్రాఫిక్​ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందిని తొలగించారు. బంజారాహిల్స్​లో ట్రాఫిక్ సీఐ స్వయంగా వరదనీరు తొలగింపునకు కృషి చేయాల్సి వచ్చింది.

నిండు కుండను తలపించిన హుస్సేన్​ సాగర్​

నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల... హుస్సేన్​సాగర్​కు భారీగా వరద నీరు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 513.9 మీటర్లు... ప్రస్తుతం 513.4 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 3,486 క్యూసెక్కులు... ఔట్‌ ఫ్లో 3,095 క్యూసెక్కులు. నాలాల పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఓవైపు నగరవాసులు వరదనీటిలో ఇబ్బంది పడుతుంటే.. అంబర్​పేట్ నాలా వద్ద.. ఓ వ్యక్తి వరదలో కొట్టుకువచ్చిన ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఇదీ చూడండి: 'తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.