Hyderabad Police Commissionerate Annual report: ఇతర నగరాలతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని బుద్ధుడి విగ్రహం వద్ద హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సీపీ విడుదల చేశారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది నేరాల శాతాన్ని 2019 తో పోల్చి చూస్తున్నామని తెలిపారు. 2019 తో పోలిస్తే ఈ ఏడాది 27 శాతం నేరాలు తగ్గాయని చెప్పారు. కాగా 2021లో సైబర్ నేరాలు భారీగా పెరిగాయని.. 5 వేలకు పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఇతర నగరాలతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో నేరాలు గణనీయంగా తగ్గాయి. 2020లో చాలా తక్కువగా నేరాలు జరిగాయి. ఈ ఏడాది నేరాలు 27 శాతం తగ్గాయి. సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. 5 వేలకు పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. -అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ
81 శాతం కేసుల్లో శిక్షలు
2020లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా తక్కువగా నేరాలు నమోదయ్యాయని సీపీ చెప్పారు. అందుకే ఈ ఏడాది నేరాల శాతాన్ని 2019తో పోల్చి చూస్తున్నామని పేర్కొన్నారు. మహిళలపై నేరాలు చాలా శాతం తగ్గాయని.. 81శాతం కేసుల్లో శిక్షలు పడేలా చేశామని సీపీ వివరించారు. మాదక ద్రవ్యాల రవాణాలో 600 మందిని అరెస్టు చేశామన్న సీపీ.. తరచూ డ్రగ్స్ తరలించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: Say no to Drugs run: యువత, చిన్నారులు డ్రగ్స్‌బారిన పడకుండా చూడాలి: గవర్నర్