ETV Bharat / state

అనాథల ఆకలి తీరుస్తున్న పోలీసులు - తెలంగాణ వార్తలు

పోలీసులంటే కొడతారు.. తిడుతారు.. కఠినంగా వ్యవహరిస్తారని అనుకుంటారు. కాని వారికి కూడా దయ, కరుణ, జాలి ఉంటుంది.. చలించే మనసు ఉంటుంది. ఆదుకోవాలని ఆరాటం ఉంటుంది. ఆ గొప్ప మనసుతోనే హైదరాబాద్​లోని అనాథ ఆశ్రమ పిల్లలు ఉచిత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

Hyderabad police
అనాథల ఆకలి తీరుస్తున్న పోలీసులు
author img

By

Published : May 20, 2021, 3:13 PM IST

హైదరాబాద్​లోని అనాథ ఆశ్రమ పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. లాక్​డౌన్ కొనసాగినన్ని రోజులు అనాథ చిన్నారులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. హర్యానా నాగరిక్ సమాజ్ ఆధ్వర్యంలో ఈ పథకం కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. మెహదీపట్నం విజయ్​నగర్ ప్రభుత్వ పాఠశాల్లో అనాథ చిన్నారులకు భోజనం అందిస్తున్నారు.

అనాథలతో పాటు దివ్యాంగులకు భోజనం అందిస్తామని హర్యానా నాగరిక్ సమాజ్ అధ్యక్షుడు ఏకే అగర్వాల్ తెలిపారు. లాక్​డౌన్ సమయంలో పలు స్వచ్ఛంద సంస్థలు... సేవ చేయడానికి ముందుకు వస్తున్నాయని.. విపత్కర పరిస్థితుల్లో సమాజానికి అండగా నిలవడం ఎంతో ముఖ్యమని సీపీ అంజనీ కుమార్ అన్నారు.

అనాథల ఆకలి తీరుస్తున్న పోలీసులు

ఇదీ చదవండి: హై-ఫై మాస్కులతో కరోనా అంతమయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.