ETV Bharat / state

మందుబాబులను నియంత్రించేందుకు పోలీసుల నిఘా.. - police focus on drunker

మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. కరోనా నేపథ్యంలో ఆరు నెలల నుంచి డ్రంకెన్‌ డ్రైవ్‌ను వాయిదా వేసిన పోలీసులు.. తాజాగా రాత్రివేళల్లోనూ వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో నిఘా ముమ్మరం చేశారు.

Hyderabad police are taking actions against drunkers
మందుబాబులపై హైదరాబాద్​ పోలీసుల నజర్
author img

By

Published : Sep 22, 2020, 1:02 PM IST

భాగ్యనగరం, శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక కూడా మద్యం లభిస్తుండటంతో కొందరు మోతాదుకు మించి తాగుతున్నారు. మద్యం మత్తులో కార్లు, ద్విచక్ర వాహనాలపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. 15 రోజులుగా ప్రమాదాలు పెరుగుతుండటంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రణాళికా ప్రకారం..

రాత్రివేళల్లో నమోదవుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు శాంతిభద్రతల పోలీసులతో కలిసి ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. వారాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు లేకపోవడంతో.. పోలీస్‌ ఠాణాల వారీగా మద్యం దుకాణాలు, రాత్రివేళల్లో మద్యం తాగే ప్రాంతాలను గుర్తించి వాటి వివరాలను గస్తీ పోలీసులకు ఇస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మద్యం దుకాణాలు, హోటళ్ల పరిసర ప్రాంతాలు, రహదారుల వద్ద వాహన చోదకుల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. అబిడ్స్‌, జగదీష్‌ మార్కెట్‌, బ్యాంక్‌స్ట్రీట్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌తోపాటు పంజాగుట్ట, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, ప్యాట్నీ, ప్యారడైజ్‌ ప్రాంతాల్లో పర్మిట్‌ రూంలపైనా దృష్టి కేంద్రీకరించారు.

చిట్టాపద్దులూ చూస్తున్నారు..

మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. గతంలో డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుడిన ప్రతి ఒక్కరి వివరాలను ట్యాబ్‌లో నమోదు చేశారు. ప్రమాదం చేసిన వ్యక్తి పేరు ట్యాబ్‌లో నమోదు చేయగానే.. గతంలో నమోదయిన వివరాలు వచ్చేస్తాయి.

అనంతరం ట్రాఫిక్‌ పోలీసులు కోర్టులో ఈ నివేదికలను సమర్పిస్తున్నారు. పోలీసుల నివేదికలను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులు జైలు శిక్షలతో పాటు మద్యం తాగి వాహనాన్ని నడిపినందుకు అదనంగా శిక్షలు విధిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా తగ్గనందున డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించడం లేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. శ్వాస పరీక్షలప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందన్న భావనతోనే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని, మెట్రోనగరాలతోపాటు పట్టణాల్లోనూ డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించడం లేదని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.