హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కింగ్ కోఠిలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రం పని తీరుపై ఆయన ఆరా తీశారు.
అనంతరం రోగులకు సక్రమంగా వైద్యం అందుతుందా లేదా... ఇంకా ఏమైనా వారికి లోటుపాట్లు ఉన్నాయా అని వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని వైద్యులకు తెలిపారు.