హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇవాళ ఉదయం పదిన్నర గంటల సమయంలో నాగోలు నుంచి అమీర్‌పేట వెళ్తున్న మెట్రో రైలు.. ప్యారడైస్ స్టేషన్ వద్ద సాంకేతిక సమస్యతో అరగంటపాటు నిలిచిపోయింది. స్పందించిన మెట్రో సాంకేతిక సిబ్బంది మరమ్మతులు చేసినప్పటికీ రైలు కదలకపోగా మరో మెట్రో రైలును రప్పించి ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్‌లోని సైడ్ ట్రాక్‌కు తరలించారు. ప్రయాణికులు ఇబ్బందిపడకుండా మరో రైలును నడిపించారు. ప్యారడైస్ స్టేషన్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగినందుకే సాంకేతిక సమస్య ఉత్పన్నమైందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండిః సమ్మె ఎఫెక్ట్: మెట్రో సేవలు పొడిగింపు