కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా పర్యటించారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని డంపింగ్ యార్డును జోనల్ కమిషనర్ మమతతో కలిసి పరిశీలించారు.
డంపింగ్ యార్డ్ నుంచి చెత్త రోడ్లపైకి రావడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని.. స్థానిక కార్పొరేటర్ జగన్ ఆమె దృష్టికి తీసుకెళ్లగా అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మేయర్ సూచించారు. నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
నగరం మొత్తం పర్యటిస్తున్నానని.. ఎక్కడా చెత్త కనిపించడం లేదని మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డిప్యూటీ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్ కొవిడ్ రిసోర్సెస్.. గంటకు 5వేల మంది!