ETV Bharat / state

దేశంలో అత్యుత్తమ‌ న‌గ‌రంగా హైద‌రాబాద్

author img

By

Published : Sep 16, 2020, 5:03 AM IST

దేశంలో అత్యుత్తమ‌ న‌గ‌రంగా అన్నింట్లో ప్రథ‌మ స్థానంగా హైద‌రాబాద్ ఎంపికైంది. హాలిడిఫై డాట్ కామ్ అనే వెబ్ సైట్ 34 నగరాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో నివాసయోగ్యమైన, వృత్తి, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై స‌ర్వే నిర్వహించింది. న‌గ‌రంలోని రామోజీ ఫిల్మ్ సిటీ, చరిత్రాత్మక చార్మినార్, గోల్కొండ కోట పర్యాటకుల దృష్టిని ఆకర్షించినట్లు ఈ సర్వేలో తేలింది.

దేశంలో అత్యుత్తమ‌ న‌గ‌రంగా హైద‌రాబాద్
దేశంలో అత్యుత్తమ‌ న‌గ‌రంగా హైద‌రాబాద్

దేశంలో అత్యుత్తమ‌ న‌గ‌రంగా హైద‌రాబాద్

హైద‌రాబాద్... దేశంలోనే ఉత్తమ న‌గరంగా ఎంపికైంది. జేఎల్ఎల్ సూచిక ఆధారంగా భాగ్యనగరం అన్ని నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. హాలిడిఫై డాట్ కామ్ వెబ్‌సైట్ నిర్వహించిన ఈ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పర్యాటకులు తమ ప్రాధాన్యతలపై గమ్యస్థానాలను ఎంపిక చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌ తోడ్పడుతుంది. దేశంలో ఉత్తమ నివాస యోగ్యనగరంగా ఎంపిక చేయడంలో సాంస్కృతిక సమ్మేళనం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలపై ఈ సైట్ ఇటీవ‌ల‌ సర్వే నిర్వహించింది.

అవే కారణాలు..

ఆయా నగరాల్లో అవకాశాలు, సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాల ఆధారంగా సర్వే నిర్వహించారు. హైదరాబాద్‌ తర్వాత 4 స్థానాల్లో ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు నిలిచాయి. సెప్టెంబరు నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా రుజువైంది. ఇక్కడి పర్యాటక కేంద్రాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ, చార్మినార్ , గోల్కొండ కోట మొదలైనవి పర్యాటకుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్నాయ‌ని రుజువైంది.

మార్గం సుగమమైంది..

సర్వే ఫలితాల ఆధారంగా పర్యాటకులు అత్యధిక సంఖ్యలో నగరాన్ని సందర్శించేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ శరవేగంగా... దక్షిణ భారత న్యూయార్క్‌గా అభివృద్ధి చెందుతోందని.. రాష్ట్రంలో పర్యటించే వారికి విశిష్ట గమ్యస్థానంగా ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఆయా అంశాల ప్రాతిపదికపై ఇప్పటివరకు జరిగిన పలు సర్వేల్లో హైదరాబాద్ ప్రథ‌మ స్థానాన్ని పొందింది. 2020లో విశిష్ట నగరాల ఎంపికపై జరిగిన సర్వేలో హైదరాబాద్ నగరం మొదటి స్థానం పొందడంతోపాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పొందింది.

ఇదీ చూడండి: ఎస్​సీఓ భేటీలో పాక్​ తప్పుడు మ్యాప్​.. భారత్​ వాకౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.