ETV Bharat / state

Hyderabad Ganesh Nimajjanam Today : భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం.. ఆ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ - ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనం

Hyderabad Ganesh Nimajjanam Today : హైదరాబాద్​లో గణనాథుల నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం మధ్య గణపయ్యలు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో సందడిగా మారాయి. మరోవైపు గణనాథుల శోభాయాత్రతో ఆ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Hyderabad Road Traffic Jam
Hyderabad Road Traffic Jam Due to Ganesh Immersion
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 2:06 PM IST

Updated : Sep 29, 2023, 4:55 PM IST

Hyderabad Ganesh Nimajjanam Today : హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో గురువారం మొదలైన సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. లిబర్టీ కూడలి వద్ద గణేశ్‌ విగ్రహాల వాహనాలు బారులు తీరాయి. బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు.. నారాయణగూడ వైపు నుంచి వచ్చే శోభాయాత్రతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఫీవర్ ఆస్పత్రి నుంచి లిబర్టీ వరకు వాహనాలతో నిండిపోయాయి. పాతబస్తీ నుంచి వచ్చే శోభాయాత్రను వీలైనంత తొందరగా ముగించాలనే ఉద్దేశంతో పోలీసులు.. నారాయణగూడ వైపు (Trafffic Jam Due to Ganesh Immersion) నుంచి వచ్చే వాహనాలు చాలా సేపు నిలిపేశారు.

Hyderabad Traffic Jam Ganesh Nimajjanam 2023 : పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ కూడలి మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు కదిలాయి. ఉదయం 9గంటల వరకు బషీర్ బాగ్ వైపు నుంచి వాహనాలు లిబర్టీ మీదుగా ముందుకు వెళ్లాయి. ఈ వాహనాలు వెళ్లిన తర్వాత నారాయణగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు వేగంగా ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. చిలకలగూడ, తార్నాక, రామాంతపూర్ నుంచి వచ్చే వాహనాలు నారాయణగూడ, లిబర్టీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకునేలా రూట్ మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఆయా ప్రాంతాల నుంచి శోభాయాత్రగా బయల్దేరిన వాహనాలు.. హుస్సేన్‌సాగర్ చేరుకోవడానికి దాదాపు 16గంటల సమయం పట్టింది. నారాయణగూడ నుంచి వచ్చిన శోభాయాత్ర లిబర్టీ వద్ద ముగియడానికి మధ్యాహ్నం 12గంటల సమయంలో లిబర్టీ చౌరస్తా వద్ద వాహనాల రాకపోకలను అనుమతించారు.

WWE Wrestler The Great Khali Participate in Adilabad Ganesh Immersion : గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన స్టార్ రెజ్లర్‌ ది గ్రేట్​ ఖలీ

Hyderabad Traffic Jam Due to Ganesh Immersion : తెలుగు తల్లి వంతెనపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి... డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బస్సు లోపల ఉన్న ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేందుకు మరో ఏడెనిమిది గంటలు సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఖైరతాబాద్ ఫ్లైఓవర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి విగ్రహం వైపు నుంచి వాహనాల రాకపోకలను ఇప్పటికి అనుమతించలేదు. విగ్రహాలతో వచ్చిన వాహనాలన్నింటినీ నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించిన తర్వాత ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వాహనాలను అనుమతించనున్నారు. కాగా ఆ ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు.. వినాయక శోభాయాత్ర, నిమజ్జనంతో నగరంలోని రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి. ఉదయం నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున రంగంలోకి దిగి.. పారిశుద్ధ్య చర్యల్లో నిమగ్నమయ్యారు. శోభాయాత్ర కొనసాగిన మార్గాల్లో జీహెచ్‌ఎంసీ కార్మికులు చెత్తను తొలగిస్తున్నారు.

Hyderabad Ganesh Nimajjanam Today భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం.. ఆ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Ganesh Nimajjanam 2023 Hyderabad : జైజై గణేశా.. బైబై గణేశా.. భాగ్యనగరంలో కన్నులపండువగా గణనాథుడి మహా నిమజ్జనోత్సవం

Crane Role in Ganesh Immersion : గణేశ్ నిమజ్జనానికి వాడే క్రేన్స్‌ ఎలా ఉపయోగిస్తారు.. వారు తీసుకునే జాగ్రత్తలు ఏంటో తెలుసా..?

Last Updated : Sep 29, 2023, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.