ETV Bharat / state

Hyderabad Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసులో 'వెంకట్​ లీలలు'.. అమ్మాయిలకు సినీ ఎర.. రేవ్ పార్టీల్లో ప్రముఖులకు వల - Madhapur Drugs Case Latest Update

Hyderabad Drugs Case Update : మదాపూర్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లోని ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మాదాపూర్‌లోని ఫ్రెష్​లివింగ్ అపార్ట్‌మెంట్‌లో టీఎస్​ న్యాబ్‌ పోలీసులు డ్రగ్స్ పార్టీ భగ్నం చేసిన కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితులు బాలాజీ, కారుమూరి వెంకటరత్నారెడ్డి, దోసకాయలపాటి మురళి.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాల్ని పోలీసులు పొందుపరిచారు.

Madhapur Rave Party Case Updates
Madhapur Drugs Case Update
author img

By Telangana

Published : Sep 2, 2023, 7:29 AM IST

Hyderabad Drugs Case Update మాదాపూర్ డ్రగ్స్ కేసులో వెంకట్​ లీలలు.. అమ్మాయిలకు సినీ ఎర.. రేవ్ పార్టీల్లో ప్రముఖులకు వల

Hyderabad Drugs Case Update : హైదరాబాద్‌ మాదాపూర్​లోని విఠల్‌నగర్ ఫ్రెష్​లివింగ్ అపార్ట్​మెంట్‌ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళీలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి సెల్‌ఫోన్‌, కాల్‌ డేటాలను, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. సినీ అవకాశాల పేరుతో అమ్మాయిలను, రేవ్‌పార్టీలతో ప్రముఖులకు ఎరవేసి మత్తుముఠా గుట్టుగా సాగించిన దందా గుట్టు.. రట్టు అయ్యింది.

Madhapur Drugs Case Latest Update : వీరి వద్ద సినీ(Tollywood in Hyderabad Drugs Case), రాజకీయ వర్గాలకు చెందిన పలువురి పేర్లు ఉన్నట్టు సమాచారం. బాలాజీ, వెంకటరత్నారెడ్డికి బెంగళూరులోని నైజీరియన్లతో పరిచయాలున్నాయి. వీరి ద్వారా కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీబ్లాట్స్‌ తదితర మాదకద్రవ్యాలు హైదరాబాద్‌కు తీసుకొచ్చి కొనుగోలుదారులకు చేరవేస్తున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గతంలో పలుమార్లు పోలీసులు అరెస్ట్‌ చేసినా జైలు నుంచి బయటకురాగానే సిమ్‌కార్డులు మార్చి మళ్లీ కొత్తగా దందా సాగిస్తున్నారు.

Hyderabad Sub Inspector Drugs Case Update : ఖాకీ వనంలో డ్రగ్స్.. ఆ ముగ్గురిపై కూడా పోలీసుల ఫోకస్​

Hyderabad Rave Party Case Update : ఇప్పటి వరకూ పోలీసులు ఈ కేసులో 24 మందిని నిందితులుగా చేర్చారు. ముగ్గురి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో లభించే ఆధారాలు, కాల్‌డేటా, ఛాటింగ్‌ ఆధారంగా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్‌ పెడ్లర్స్‌, బెంగళూరులో కొనుగోలుదారులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుల ఫోన్‌కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్స్‌లో వీరి పేర్లు గుర్తించారు. డ్రగ్స్‌ లావాదేవీల్లో అసలు పేరు బయటపడకుండా ‘నిక్‌ నేమ్‌’తో చలామణీ అవుతుండటంతో బయటపడుతున్న నిందితుల అసలు పేరు గుర్తించటం, వివరాలు రాబట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది.

Film Financier Venkat Crimes : పెద్దఎత్తున డ్రగ్స్‌ హైదరాబాద్‌కు చేరబోతుందనే పక్కా సమాచారంతో గుడిమల్కాపూర్‌ పోలీసులు, టీన్యాబ్ పోలీసులు (Telangana Anti Narcotics Bureau)అప్రమత్తమయ్యారు. ఆగస్టు 31 సాయంత్రం రేతిబౌలి క్రాస్‌రోడ్‌ వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కాపా భాస్కర్‌ బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద కొకైన్, ఎక్సటసీ పిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదారాలకు తాను అలవాటుపడినట్టు పోలీసుల ఎదుట భాస్కర్‌ వెల్లడించాడు. ఏ2 కారుమూరి వెంకటరత్నారెడ్డితో కలసి సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌ అద్దెకు తీసుకొని తరచూ డ్రగ్‌పార్టీలు నిర్వహిస్తామని పోలీసులకు తెలిపాడు.

మాదాపూర్‌లోని ఫ్రెష్‌లింగ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన డ్రగ్ పార్టీ కోసం అవసరమైన కొకైన్, ఎక్సటసీ పిల్స్‌ను కొనేందుకు కొద్దిరోజుల ముందు బెంగళూరు వెళ్లినట్టు చెప్పాడు. అక్కడి నైజీరియన్‌ ఇగ్వారే మైకేల్‌ నుంచి 26 ఎక్సటసీ పిల్స్, థామస్‌ అన్హా నుంచి కొకైన్‌ కొనుగోలు చేసినట్టు తెలిపాడు. మాదాపూర్‌ విఠల్‌రావునగర్‌లోని ఫ్రెష్‌లివింగ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ కోసం తీసుకెళ్తున్నట్టు పోలీసులకు నిందితుడు వివరించాడు.

Drug Peddlers Arrested In Hyderabad : మాదక ద్రవ్యాల రవాణా కింగ్‌పిన్‌ అరెస్ట్..

అతడి ద్వారా రాబట్టిన సమాచారంతో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు, గుడిమల్కాపూర్‌ పోలీసులు మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో తనిఖీ చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూ కోసం రప్పించిన ఇద్దరు యువతులను అక్కడ గుర్తించారు. వెంకటరత్నారెడ్డి ఇచ్చిన సమాచారంతో రైల్‌నిలయంలో సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ దోసకాయలపాటి మురళిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Film Financier Venkat in Hyderabad Drugs Case : : డ్రగ్స్‌(Drugs Supply Hyderabad) కేసులో అరెస్టయిన ఏ2 కారుమూరి వెంకట రత్నారెడ్డి నేర చరిత్ర పోలీసులను ఉలికిపాటుకు గురిచేసింది. గుంటూరులోని నెహ్రూనగర్‌ ఇతడి స్వస్థలం. ఎన్నారై, ఐఆర్‌ఎస్‌ అధికారి, ఎస్పీ గన్‌మెన్, డిజైనర్‌ పేర్లతో నకిలీ వేషాలతో వెంకటరత్నారెడ్డి చెలరేగాడు. డీఆర్‌ఐ అధికారిగా చెబుతూ తెలుగు సినీ నిర్మాతలతో విమానటిక్కెట్లు,హోటల్‌ బిల్లు కట్టించాడు. ఇద్దరి నుంచి 30లక్షలు కొట్టేశాడని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

Tollywood in Hyderabad Drugs Case : నిత్య పెళ్లికొడుకు అవతారంతో ప్రవాసాంధ్రులను బోల్తాకొట్టించాడు. ఏపీ, తెలంగాణల్లో ఇతడి బారినపడి ఎంతో మంది నష్టపోయారు. తెలుగునాట వెంకటరత్నారెడ్డిపై దాదాపు 25కు పైగా కేసులు నమోదయ్యాయిని తేలింది. మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌గా పోలీసు రికార్డులోకి చేరిన ఇతడి మోసాల జాబితా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐగా ఒక యువతికి పరిచయమై పెళ్లి చేసుకుంటానంటూ 20లక్షలు కాజేసి ముఖం చాటేశాడు. ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ ఓ మహిళ నుంచి 30లక్షలు నొక్కేశాడు.

భూవివాదాలు, కుటుంబ తగాదాల్లో తలదూర్చి లక్షలు కమీషన్‌ కాజేసినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నకిలీ పత్రాల భూ విక్రయాలు, వ్యభిచార కార్యకలాపాలు, నకిలీపాస్‌పోర్టు కేసుల్లో అరెస్టయి అనేక సార్లు జైలుకెళ్లొచ్చాడు. పవిత్ర తిరుమలలో స్వామివారి దర్శనం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారిగా దరఖాస్తు చేసుకొని అడ్డంగా దొరికాడు. గుంటూరులోని ఇతడి నివాసంలో ఎస్‌ఈబీ అధికారుల సోదాల్లో 10లక్షల విలువైన విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

వెంకటరత్నారెడ్డి అలియాస్‌ వెంకట్‌ మోసాలతో కూడబెట్టిన సొమ్ముతో సినీ నిర్మాత అవతారమెత్తాడు. దిల్లీ, ముంబయి, తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులకు సినీ అవకాశాలిప్పిస్తానంటూ వ్యభిచారకూపంలోకి నెట్టేస్తున్నట్టు పోలీసులు నిర్దారించారు. యువతులు, మైనర్లను నగరానికి రప్పించి రేవ్‌పార్టీలో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లోని ప్రముఖులకు వల విసురుతున్నట్టు తాజా దర్యాప్తులో గుర్తించారు. ముగ్గురు ప్రధాన నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Hyderabad customs police destroy drugs : 'రూ.950 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.