ETV Bharat / state

'పరిశీలకులకు మాత్రమే ఫోన్​ అనుమతి'

లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సన్నద్ధమైంది. ఈనెల 23న ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకు నగరంలో 144 సెక్షన్​ అమల్లో ఉంటుంది. దాదాపు 5వేలకు పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

పరిశీలకులకు మాత్రమే ఫోన్​ అనుమతి
author img

By

Published : May 21, 2019, 8:03 PM IST

పరిశీలకులకు మాత్రమే ఫోన్​ అనుమతి

సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు హైదరాబాద్​లో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్​ తెలిపారు. ఒక్కో కేంద్రానికి ప్రత్యేక ఇంఛార్జీలను నియమించామన్నారు. ఎన్నికల పరిశీలకులకు మాత్రమే కేంద్రంలోకి సెల్​ఫోన్​ అనుమతిస్తామని తెలిపారు. ఈ-సువిధ అనే విధానం ద్వారా ప్రతి రౌండ్​ పూర్తి కాగానే ఫలితం వెల్లడిస్తామన్నారు. కౌంటింగ్​ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఒక్కో కేంద్రానికి డీసీపీని బాధ్యులుగా నియమించామన్నారు. ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలు నిషేధించామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : 15 శాతం వృద్ధిరేటు.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.