కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న జర్నలిస్ట్, వైద్య,పోలీస్, శానిటరీ వర్కర్లను ఆదుకోవాలని సీపీఐ నేత చంద్రమోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
దాతలు ఇచ్చిన నిధులు, వాటి వినియోగం వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ సరైన వైద్యం అందించాలన్నారు. అన్ని వర్గాల పేదలు, వలస కూలీలను ఆదుకోవాలని కోరారు. అనంతరం బండ్లగూడ తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చూడండి: మీరు పల్లీలు తింటున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!