దేశంలో ఏ రాష్ట్రంలో లేని సదుపాయాలను పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కేసిఆర్ కల్పించారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో సక్రమంగా పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. దేశంలో హైదరాబాద్ నాలుగవ పెద్ద నగరమని... ప్రపంచంలో న్యూయార్క్ నగరంతో సమానంగా హైదరాబాద్ ఉందని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో న్యూయార్క్ సిటీలో 250కి పైగా హత్యలు జరిగితే... నగరంలో 85 మాత్రమే జరిగాయని సీపీ తెలిపారు. న్యూయార్క్‌తో హైదరాబాద్ పోల్చుకుంటే... క్రైమ్‌లో 1/4లో సిటీ ఉందన్నారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నగరంగా రాజధాని ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం... ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 700 ఇన్నోవా కార్లతో పాటు... 5 వేల ద్విచక్ర వాహనాలు పోలీస్ శాఖకు అందించారన్నారు. అనంతరం పశ్చిమ మండలం పెట్రోల్ వాహన నిర్వహణ, పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు, ప్రశంస పత్రాలు సీపీ అందజేశారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!