ETV Bharat / state

Hyderabad CP On Traffic Challans: 'చలాన్లు పేరుకుపోవడం వల్లే రాయితీలు' - Hyderabad Traffic Challans

Hyderabad CP On Traffic Challans: చలాన్లు పేరుకుపోవటం వల్లే రాయితీ కల్పిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆన్‌లైన్, లోక్ అదాలత్ ద్వారా చెల్లింపు సౌకర్యం ఉంటుందని వెల్లడించారు.

CV Anand
CV Anand
author img

By

Published : Feb 26, 2022, 3:58 PM IST

'చలాన్లు పేరుకుపోవడం వల్లే రాయితీలు'

Hyderabad CP On Traffic Challans: రెండేళ్లలో ట్రాఫిక్‌ చలాన్లు పేరుకుపోవటంతో రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ కల్పిస్తామని వివరించారు. 4 చక్రాల వాహనాలకు జరిమానాలో 50శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆన్‌లైన్, లోక్ అదాలత్ ద్వారా చెల్లింపు సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. మార్చి 12వ తేదీన మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రాయితీ ఇస్తే వాహనదారులు చెల్లించే అవకాశం ఉందని సీవీ ఆనంద్‌ అభిప్రాయపడ్డారు.

'రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు వేస్తూ పోతున్నాం. కానీ ప్రజలు కట్టడం లేదు. దీనికి తోడు కోర్టు ప్రొసీడింగ్స్ కూడా జరగడం లేదు. 1.7 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీటి చలాన్ల విలువ సుమారు రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. వీటిని కట్టే పరిస్థితుల్లో లేరు. దీని గురించి మేం జ్యుడీషియరీతో చర్చించాం. దీంతో రాయితీలిచ్చి చలాన్లు కట్టించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.'

-- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 వరకు నిఘా..

తప్పని తెలిసినా అనేక మంది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ.. ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో నాలుగైదేళ్లుగా నమోదైన ప్రమాదాలను అధ్యయనం చేయగా.. రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇందులో మద్యం మత్తు, అతివేగమే కారణంగా ఉంటోందని తేల్చారు. అందుకోసం రాత్రివేళల్లోనూ పని చేసే అత్యాధునికమైన స్పీడ్​ లేజర్​ గన్​లను త్వరలో తెప్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 వరకు ట్రాఫిక్​ పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ట్యాంక్​బండ్​, మలక్​పేట, సికింద్రాబాద్, బోయిన్​పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వీరిని నియమించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: CHALLANS: రూ.600 కోట్ల పెండింగ్​ చలాన్లు.. వసూలు కోసం రాయితీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.