ట్రాఫిక్ పోలీసులు ఫిట్‌గా ఉంటేనే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. నగరంలోని హైదర్‌గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అపోలో ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్‌తో కలిసి సీపీ ప్రారంభించారు.
నగరంలో నిత్యం రోడ్లపై విధులు నిర్వహిస్తూ... కాలుష్యంతో ట్రాఫిక్ సిబ్బంది ఎంతో మంది రోగాల బారిన పడుతున్నారని... ఇటువంటి హెల్త్ క్యాంప్‌ల వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని సీపీ అన్నారు. ట్రాఫిక్ పోలీస్ అంటే ప్రత్యేక గుర్తింపు ఉందని... ట్రాఫిక్ నియమాలను తెలియపరుస్తూ, ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులకు జాగ్రత్తలు ఇస్తూ విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమయపాలన లేకుండా పనిచేస్తూ... ఆరోగ్యంపై దృష్టి పెట్టలేని పరిస్థితిలో ఉంటున్నారని... అందుకోసమే వారి ఆరోగ్య రక్షణ కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!