భాగ్యనగరంలో జరుగుతోన్న గణేశ్ నిమజ్జనం అర్ధరాత్రికి పూర్తవుతుందని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున 50 క్రేన్లు ఏర్పాటు చేశామని.. వీటి సహాయంతో వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోందని పేర్కొన్నారు.
నిమజ్జన కార్యక్రమంలో ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహాయంతో భద్రతా చర్యలు చేపట్టామని సీపీ తెలిపారు. ఇప్పటి వరకు 1000 వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయని స్పష్టం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ 99 శాతం మంది మాస్కులు ధరించి వచ్చారని.. అయినప్పటికీ కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..