ETV Bharat / state

Hyd CP Anjani Kumar: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ సీపీ

author img

By

Published : Jun 9, 2021, 7:15 PM IST

కరోనా విపత్తుపై హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అవగాహన కల్పించారు. సడలింపు వేళ మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. లాక్​డౌన్​ సమయంలో అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

hyderabad cp anjani kumar raising awareness on corona
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ సీపీ

రేపటి నుంచి పెంచిన లాక్ డౌన్ సడలింపు సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్​లోని అసెంబ్లీ ఎదుట కరోనాపై అవగాహన కల్పించారు. అనంతరం చెక్ పోస్టులను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది కరోనా వైరస్ వేషధారణలో అవగాహన చేపట్టారు. లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తామన్న సీపీ... అకారణంగా బయటకు వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు.

ఇప్పటివరకు దాదాపు లక్ష వాహనాలు సీజ్ చేశామని అంజనీ కుమార్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్​లో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని రెండు వేలకు పైగా సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని... దురదృష్టవశాత్తు వైరస్​తో 17 మంది చనిపోయారని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.