ప్రజలకు సేవ, భద్రత కల్పించేందుకే పోలీసులున్నారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి పోలీసులను.. ప్రజలకు చేరువ చేశామన్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. నిజాం కళాశాల మైదానంలో ఐదు రోజులుగా పలు జోన్లకు చెందిన పెట్రోల్ వాహనాల సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ఏడాది కాల వ్యవధిలో పెట్రోల్ సిబ్బంది.. క్షేత్రస్థాయిలో చేసిన పనుల గురించి సీపీ అంజనీకుమార్ వివరించారు. ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించారు. ఫిర్యాదు రాగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 100 నెంబర్కు ఫిర్యాదు రాగానే పాట్రోల్ సిబ్బంది 8 నిమిషాలలోపు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని అంజనీ కుమార్ తెలిపారు. పాట్రోల్ కారు, బ్లూ కోట్స్ సిబ్బంది హైదరాబాద్ కమిషనరేట్ పనితీరుకు ప్రచారకర్తలుగా ఉన్నారని సీపీ వివరించారు.
ఇదీ చూడండి: నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా?