దేశంలోకెల్లా అత్యధిక సీసీ కెమెరాలు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందని హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. సికింద్రాబాద్‌లోని ఖార్ఖానా నూతన పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ఆయన ప్రారంభించారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయాగపడతాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఖార్ఖానా నూతన పోలీసు స్టేషన్ పరిధిలో కొత్తగా 46 సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా స్టేషన్ ప్రాంగణంలో ఎమ్మెల్యే సాయన్నతో కలిసి మొక్కలు నాటారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 3 లక్షల 85 వేల సీసీ కెమెరాలు ఉన్నాయని సీపీ తెలిపారు. రాబోయే కాలంలో వీటీ సంఖ్య మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు తోడ్పాటు అందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకి, దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: People rush: చేపల వ్యాను బోల్తా.. ఎగబడిన జనం