విధుల్లో నిజాయతీ చాటుకున్న కానిస్టేబుల్‌ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రశంసించారు. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న త్రిపురనేని కుమార్ అనే వ్యక్తి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పశ్చిమ మండలం స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రామకృష్ణ.. వివరాలు కనుక్కోవడానికి కుమార్ ఇంటికి వెళ్లాడు.
కానిస్టేబుల్ రామకృష్ణను ఇంట్లోకి ఆహ్వానించిన కుమార్.. కానిస్టేబుల్‌కు కావాల్సిన వివరాలు తెలిపాడు. అనంతరం కానిస్టేబుల్ రామకృష్ణకు కొంత నగదు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించిన కానిస్టేబుల్.. విధులు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం తనకు జీతం ఇస్తుందని సమాధానమిచ్చాడు. దీంతో కానిస్టేబుల్ నిజాయతీని మెచ్చుకున్న కుమార్ త్రిపురనేని.. సీపీ అంజనీకుమార్‌కు ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశాడు. ఫలితంగా సీపీ అంజనీకుమార్ తన కార్యాలయంలో రామకృష్ణకు జ్ఞాపిక ఇచ్చి అభినందించారు.
ఇదీ చూడండి: Suicide: 'నువ్వు అందంగా లేవు.. ఇంకో పెళ్లి చేసుకుంటా..!'