నగరంలోని పాతబస్తీలో లాక్ డౌన్ పర్యవేక్షించేందుకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గుర్రం ఎక్కారు. పలు వీధుల్లో తిరుగుతూ స్థానిక పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చార్మినార్, లాడ్ బజార్ మీదుగా పలు వీధుల్లో సంచరించారు. అదేమార్గంలో హైకోర్టు మీదుగా మదీనా, చార్మినార్ వద్దకు చేరుకున్నారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బయటికి వస్తే వాళ్లపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని సీపీ తెలిపారు. పాతబస్తీలో ప్రజలు లాక్ డౌన్‌కు ఎంతో సహకరిస్తున్నారని అంజనీ కుమార్ అన్నారు.