ETV Bharat / state

కలర్స్​ హెల్త్​కేర్​కు వినియోగదారుల కమిషన్ షాక్.. - కలర్స్ హెల్త్​కేర్

Fine to Kolors health care: అధిక బరువుతో బాధపడుతున్నారా...? ఇంటి దగ్గర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? మా వద్దకు రండి.. కొద్ది రోజుల్లోనే నాజుకైన శరీరం మీ సొంతం.. తక్కువ రోజుల్లోనే కేజీల లెక్కన బరువు తగ్గొచ్చు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోతున్నవారు కోకల్లలు. తాజాగా ఓ వనపర్తికి చెందిన బాలిక... ఓ సంస్థ చేతిలో మోసపోగా... వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించింది. ఆ సంస్థకు వినియోగదారుల కమిషన్​ షాక్​ ఇచ్చేలా తీర్పునిచ్చింది.

hyderabad Consumer court fine to Colors health care
బరువు తగ్గలేదు.. పరిహారం చెల్లించాల్సిందే
author img

By

Published : Jul 19, 2022, 12:06 PM IST

Fine to Kolors health care: అధిక బరువుతో బాధపడుతున్నారా..? కొన్ని రోజుల్లోనే నాజుకైన శరీరం మీ సొంతమవుతుందన్న ప్రకటన చూసి వనపర్తి విద్యార్థిని రుక్సర్‌నాజ్‌ మోసపోయింది. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా చెల్లించిన ఫీజు వడ్డీతో, పరిహారం చెల్లించాలని కమిషన్‌-3 కలర్స్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను ఆదేశించింది.

ఫిర్యాదుదారు పెళ్లి కుదరడానికి అధిక బరువు సమస్యగా మారడంతో అత్తాపూర్‌లోని ప్రతివాద సంస్థను సంప్రదించింది. రూ.80వేలు చెల్లించి చికిత్స తీసుకుంటే 20 కిలోల బరువు తగ్గుతావని ఆ సంస్థవారు చెప్పారు. మూడు నెలల్లో ఫలితం లేకపోవడంతో తన డబ్బు తిరిగి చెల్లించాలని కోరగా సంస్థ స్పందించలేదు. ఫిర్యాదుపై విచారించిన కమిషన్‌-3 బెంచ్‌ సాక్ష్యాలు పరిశీలించి రూ.80వేలు, 12 శాతం వడ్డీతో, పరిహారం రూ.10వేలు, ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని కలర్స్‌ను ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.