లాక్డౌన్ సడలింపులతో భాగ్యనగరంలోని దేవాలయాల్లో సందడి మొదలైంది. ఆలయాల్లోనికి వెళ్లేందుకు భక్తులకు అనుమతి ఇవ్వగా నగరంలోని పలు కోవెలల్లో దైవభక్తులు సందడి చేశారు.
హైదారాబాద్ చిక్కడపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే ఆలయంలోనికి భక్తులను అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూనే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత స్వామివారిని కళ్లారా చూసే భాగ్యం కలిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రభుత్వం అనుమతించినా.. కరోనా భయంతో కొందరు భక్తులు ఆలయాలకు రాకపోవడం వల్ల ఆలయాల్లో రద్దీ ఎక్కువగా కనిపించలేదు.