ETV Bharat / state

'హైరానా'బాద్: కరోనా సోకితే... వైద్యం అందేనా?

హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగిపోవడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆస్పత్రులు బాధితులతో నిండి ఉండటంతో.. తమకు వైరస్‌ సోకితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూస్తున్నారు.

CORONA
CORONA
author img

By

Published : Jun 29, 2020, 11:45 AM IST

హైదరాబాద్‌ మహానగరాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గడిచిన వారం రోజుల్లో 5వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు పడకలు లభించకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులు ఇప్పటికే బాధితులతో నిండి ఉండటంతో.. తమకు వైరస్‌ సోకితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

భయంతో పలుచోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేస్తున్నారు. ప్రభుత్వం మరోమారు గ్రేటర్‌లో లాక్‌డౌన్‌ విధించడంపై ఆదివారం చర్చ జరపడంతో ప్రజలు సైతం జాగ్రత్తపడుతున్నారు. మాటిమాటికి బయటకు వెళ్లకుండా ఉండేలా రెండు, మూడు వారాలకు సరిపడా ఒకేసారి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. అత్యవసర విభాగంలోని ఔషధ దుకాణాల యజమాన్యాలు సైతం సాయంత్రం 7గంటల వరకే సేవలందిస్తామని ప్రకటించడం పరిస్థితికి అద్దంపడుతోంది.

స్వచ్ఛందంగా మూత..

గత కొన్ని రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారులు రోజూ 3వేలకుపైగా నమూనాలను పరీక్షిస్తున్నారు. అందులో 25 నుంచి 30శాతం మందికి వైరస్‌ సోకినట్లు తేలుతుంది. ప్రభుత్వం మున్ముందు 6వేల పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పుడు ఇదే స్థాయిలో కేసులు వెలుగులోకి వస్తే సమస్య తీవ్రత పెరుగుతుంది. చికిత్స, హోం ఐసోలేషన్‌, ఇతరత్రా అంశాల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని జనాల్లో ఆందోళన మొదలైంది.

ఈ నేపథ్యంలో చాలా మంది స్వచ్ఛందంగా ఎవరికి వారు లాక్‌డౌన్‌ ప్రకటించుకుంటున్నారు. బేగంబజార్‌లోని వ్యాపారులు ఆ దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అదే బాటలో ఆదివారం షేక్‌పేట, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో వ్యాపారులు పరిస్థితి కుదుటపడే వరకు దుకాణాలు మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో బల్దియా అధికారులు సైతం అనధికారికంగా ఆ మేరకు సూచనలు చేస్తున్నారు.

గేటుదాటని గేటెడ్‌ కమ్యునిటీలు..

గ్రేటర్‌లోని పలు గేటెడ్‌ కమ్యునిటీలు కరోనా వ్యాప్తి నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కూరగాయలు, ఇతర నిత్యావసరాల కోసం ఇరుగుపొరుగు వారు వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. నాణ్యమైన కూరగాయలను సరఫరా చేసే రైతులను ఎంచుకోవడం, వాళ్లకి ఓ రోజు ముందు అవసరమైన కూరగాయల జాబితా ఇస్తున్నారు. మరుసటి రోజు రైతు సరకును నేరుగా అపార్ట్‌మెంట్‌కు చేరవేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మలేషియన్‌ టౌన్‌షిప్‌ వాసులు స్పష్టం చేస్తున్నారు.

10వేల కేసులు..

ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 10వేల మంది కొవిడ్‌ బారినపడ్డారు. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు నమోదైన కేసులే 5,142 ఉన్నాయి. ఆ స్థాయిలో బాధితులు పెరగడంతో అధికారులు వ్యాధి లక్షణాల్లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 4వేల మందికిపైగా బాధితులు ఇంట్లో ఉంటూ చికిత్స అందుకుంటున్నారు. అలాంటి వారికి ఔషధాలు, సూచనలు అందజేస్తున్నామని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించేందుకు హెల్ప్‌లైన్‌ నెంబరు ఇస్తున్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.