ETV Bharat / state

'పోస్టుకార్డులపై మోదీ, ట్రంప్​ చిత్రాలు గీసిన విద్యార్థులు' - VSR School Students Post Cards Pictures

భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకను పురస్కరించుకుని హైదరాబాద్​ బాచుపల్లి ప్రగతినగర్​లోని వీఆర్​ఎస్​ పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. 425 మంది విద్యార్థులు 1200 పోస్టుకార్డులపై ట్రంప్​తో పాటు ప్రధాని మోదీ​ చిత్రాలను 20 నిమిషాల్లోనే గీసి ఔరా అనిపించారు.

Modi Trump
Modi Trump
author img

By

Published : Feb 20, 2020, 7:08 PM IST

Updated : Feb 20, 2020, 9:48 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటించనున్న తరుణంలో భాగ్యనగరం బాచుపల్లి ప్రగతినగర్​ వీఆర్​ఎస్​ పాఠశాల విద్యార్థులు ఆయనకు నూతన రీతిలో ఆహ్వానం పలికారు. 20 నిమిషాల్లోనే 425 మంది విద్యార్థులు 1200 పోస్టు కార్డులపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చిత్రాలను చిత్రించారు.

పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్, సీఈఓ సత్యవోలు రాంబాబు పాల్గొని... విద్యార్థులు గీసిన చిత్రాలను పరిశీలించి... విశ్వ గురు ప్రపంచ రికార్డుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కనబరిచిన నైపుణ్యాన్ని పాఠశాల డైరెక్టర్​ కొడాలి విజయరాణి ప్రశంసించారు. ఈ 1200 పోస్టుకార్డులను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిస్తామని ఆమె తెలిపారు.

'పోస్టుకార్డులపై మోదీ, ట్రంప్​ చిత్రాలు గీసిన విద్యార్థులు'

ఇదీ చూడండి: ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

Last Updated : Feb 20, 2020, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.