హైదరాబాద్ మహానగరంలో జరగబోయే వీర హనుమాన్ శోభాయాత్రకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. శోభ యాత్ర జరిగే ప్రాంతాల్లో దాదాపుగా 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు 1200ల మంది పోలీసులతో గట్టి బందోబస్తును నిర్వహిస్తామన్నారు.
శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు
శోభాయాత్ర దారిపొడవునా మంచినీటి సౌకర్యం రోడ్ల మరమ్మతులు, శానిటేషన్‌కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. శుక్రవారం ఉదయం 7:30గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని... సాయంత్రం 7 గంటలకు తాడ్ బండ్ ఆలయానికి చేరుకుంటుందని వెల్లడించారు.
భక్తులు... జాగ్రత్తలు...
శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చే భక్తులు ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని రావాల్సిందిగా అధికారులు సూచించారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో గుడి వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్‌వర్మ