మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. నేచర్ కేర్ ఇన్నోవేషన్ సర్వీసెస్ సంస్థ తయారు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్లను ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని తెలిపారు.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ కవర్స్ అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : సినీ నటుడు శివాజీ ఇంట్లో పోలీసుల తనిఖీలు