హుజూరాబాద్(Huzurabad by election) లో పని చేసిన వివిధ కులసంఘాల ప్రతినిధులను కలిసి ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోకెల్లా ఎన్నికల్లో అత్యధిక ఖర్చు హుజురాబాద్ ఉప ఎన్నికకే పెట్టారని ఆయన అన్నారు. దీన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా చేస్తారా.. అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుల సంఘాల ప్రతినిధులతో ఆయన కాసేపు ముచ్చటించారు.
సర్వీసు నుంచి వ్యాపారం వరకు
సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చిందని ఈటల రాజేందర్(Etela Rajender) ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనాడు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసే కోణంలో ఉండేవని కానీ.. కేసీఆర్ మాత్రం వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఓటు కోసం డబ్బులిచ్చి పసుపు కుంకుమ మీద, కుల దేవతల మీద ప్రమాణం చేయించారని ఆరోపించారు. తనకు నరకం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అణచి వేస్తున్నారు
అస్తిత్వం, త్యాగశీలత, ఆత్మగౌరవానికి మారుపేరుగా తెలంగాణ ఉండేదని.. కానీ ఇప్పుడు కేసీఆర్ డబ్బుల తెలంగాణగా మార్చారని ఈటల(Etela Rajender) ఆవేదన చెందారు. గొంతెత్తిన ప్రతి ఒక్కరినీ అణచివేస్తున్నారని ఆరోపించారు. మొన్న ఎన్నికల్లో(Huzurabad by election) ప్రజలంతా ధర్మం కోసం అండగా ఉన్నారని.. హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కొనసాగటం ఈ సమాజానికి అరిష్టమని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా స్పందించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈటల(Etela Rajender) అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారని వివరించారు.
ఇదీ చదవండి: Harish rao Dharna: 'జై కిసాన్‌ను భాజపా ప్రభుత్వం నై కిసాన్‌గా మార్చింది'