హైదరాబాద్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు హుస్సేన్‌సాగర్‌లోకి ప్రవాహం పెరిగింది. జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో హుస్సేన్ సాగర్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద లోతట్టు ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.
ఇదీ చూడండి : నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం