హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య చిన్నపాటి గొడవ కారణంగా భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. లక్ష్మీనారాయణ కాలనీలో శ్రీనివాసరావు, సుశీల దంపతులు నివాసముంటున్నారు. ఇద్దరి మధ్య ఇటీవల చిన్నపాటి విషయాలకే గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇదే విషయంపై మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో భర్త శ్రీనివాసరావు భార్యను రోకలితో తలపై మోది పరారయ్యాడు. భార్యకు తీవ్ర గాయాలు కావటం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?