కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ.. తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వాహణలో అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీసు సిబ్బందికీ పలువురు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్కు చెందిన 'ది పర్పస్ ఛారిటబుల్ ట్రస్ట్'.. లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు ఓఆర్ఎస్లను అందజేసి మానవత్వాన్ని చాటుకుంటోంది. అలాగే గత కొద్ది రోజులుగా ఆకలితో అలమటిస్తోన్న పేదలకు.. భోజనాన్ని పంపిణీ చేస్తూ అండగా నిలుస్తోంది.
![Humanists in covid crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11906966_241_11906966_1622030082610.png)
ఆపత్కాలంలో మానవతావాదులంతా ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని.. ట్రస్ట్ వ్యవస్థాపకుడు బ్లెస్సో శ్యామ్యూల్ కోరారు. దాతలు.. ఏపీకి చెందిన మద్దుల సూర్య నారాయణ, శ్రీలక్ష్మిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి కృషి చేసిన.. హయత్‌నగర్ సీఐ సురేందర్, ఎస్సై రాజు, ప్రముఖ యూత్ మోటివేటర్ వేణు కల్యాణ్, తదితర సామాజిక కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్