ETV Bharat / state

నిమ్స్‌లో కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌... ఒక్కొక్కరికి మూడు డోసులు

author img

By

Published : Jul 7, 2020, 3:52 PM IST

Updated : Jul 7, 2020, 6:37 PM IST

భారత్‌ బయోటెక్ సారథ్యంలో రూపొందిన కరోనా వ్యాక్సిన్‌.. ‘కొవాగ్జిన్ ’క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభమైంది. భారత్ బయోటెక్‌, ఐసీఎంఆర్​, ఎన్​ఐవీ సహకారంతో కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ట్రయల్స్‌ తొలిదశలో భాగంగా నిమ్స్‌లో స్క్రీనింగ్ ప్రారంభించామని అధికారులు తెలిపారు.

human-trials-of-covaxin-starts-in-nims-hospital
నిమ్స్‌లో కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌... ఒక్కొక్కరికి మూడు డోసులు

కరోనా వ్యాప్తి తీవ్రత ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోనూ రోజురోజుకూ కేసులు అధికం అవుతున్నాయి. నియంత్రణ తప్ప ఇప్పటి వరకు ఈ వైరస్‌కు పూర్తిస్థాయిలో నివారణ లేదు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

నిమ్స్​కు స్థానం

దేశంలోనూ ఈ ప్రక్రియ ఊపందుకుంది. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ కీలక దశలోకి చేరింది. మానవులపై తొలిదశ ప్రయోగానికి ప్రక్రియ మొదలైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్వదేశీ వాక్సిన్‌ క్లినికల్ ట్రయిల్స్‌ని ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 12 సంస్థలను క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్​ ఎంపిక చేసింది.

రాష్ట్రానికి చెందిన నిమ్స్ ఆస్పత్రికి అందులో స్థానం ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సదుపాయాలకు ఎథికల్ కమిటీ నుంచి నిమ్స్‌కు అనుమతులు లభించాయి. నేటి నుంచి ఆస్పత్రిలో ట్రయల్స్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

అంగీకార పత్రం తీసుకుని...

నిమ్స్ ఆసుపత్రికి గత 20 సంవత్సరాల నుంచి ఫేజ్-1 ట్రయిల్ నిర్వహించిన అనుభవం ఉంది. ఇప్పటికే నిమ్స్‌లో కొవాగ్జిన్‌ ట్రయిల్స్‌ నిర్వహించడానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను అధికారులు సిద్ధం చేశారు. వ్యాక్సిన్‌కు సంబంధించి మొత్తం మూడు ఫేజ్‌లలో ట్రయల్స్ చేస్తామని నిమ్స్ వర్గాలు తెలిపాయి.

ముందుగా ఆరోగ్యవంతమైన వ్యక్తుల నుంచి ట్రయల్స్‌కు సిద్ధంగా ఉన్నామనే అంగీకార పత్రాన్ని తీసుకుంటారు. అనంతరం వారి నుంచి రక్త నమునాలను సేకరించి ఆ నమూనాలను దిల్లీకి పంపి క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆరోగ్యం సహరిస్తుందో..? లేదో..? పరీక్షిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను నిమ్స్‌లో ప్రారంభించారు.

ఆ తరువాతే రెండో డోస్

దాదాపు 30 నుంచి 60 మంది నుంచి నమూనాలు సేకరిస్తారు. రక్త నమునా పరీక్షల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధరణ అయితే... తొలివిడత వ్యాక్సిన్ ఇస్తారు. వయసు, లింగబేధాలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ డోస్‌ను నిర్ణయిస్తారు. ఒకసారి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత రెండురోజుల పాటు వారిని ఆసుపత్రిలో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.

అనంతరం డిశ్చార్జ్ చేసి 14 రోజులపాటు వారి ఆరోగ్య సమాచారాన్ని గమనిస్తారు. ఆ నివేదికలను ఐసీఎంఆర్​కు పంపి పరిశీలిస్తారు. మొదటి డోస్ తీసుకున్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకపోతే 14 రోజుల తరువాత 2వ డోస్‌ను ఇస్తామని నిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

వ్యాక్సిన్ రెండు డోస్‌లు పూర్తయ్యాక.. మూడో డోస్ ఇచ్చి ఎఫికసి పరీక్షిస్తారు. అన్ని దశల్లోనూ వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇచ్చినట్టు రుజువైతే అది మానవులకు ఇచ్చేందుకు అర్హత సాధించినట్టు అవుతుందని నిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి: నిమ్స్​లో భారత్​ బయోటెక్ కోవాగ్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Last Updated : Jul 7, 2020, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.