గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. నగర శివారు నుంచి వచ్చే ప్రజలు ఎంఎంటీఎస్నే ఆశ్రయిస్తున్నందున రైళ్లు కిక్కిరిపోతున్నాయి. తిరుగు ప్రయాణంలో ఈ ఒక్క స్టేషన్లోనే రైలు మొత్తం నిండిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో సేవలను ప్రజలు విరివిగానే ఉపయోగిస్తున్నారు. వీటిలో కూడా రద్దీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులు ఇక్కడే ఆగటం వల్ల... ప్రజలు కాలినడకన ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. సాయంత్రం సమయంలో గణేశ్ నిమజ్జనం చూసేందుకు సందర్శకులు ఎక్కువగా తరలిరావటం వల్ల రద్దీ భారీగా పెరిగింది.
ఇవీ చూడండి : ఖైరతాబాద్ గణపతికి ఆ డ్రైవరే ఏడోసారి