హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం వస్తోంది. రెండు రోజుల ఈ-వేలంలో మొత్తం 290 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గజం భూమి ధర అత్యధికంగా 79 వేల 900 రూపాయలు పలికింది. మొత్తం 124 ప్లాట్లకుగాను రెండురోజుల్లో 90ప్లాట్లు అమ్ముడైపోయాయి. మిగితా ప్లాట్లకు నేడు వేలం పాట కొనసాగనుందని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: "కొండను తవ్వి ఎలుకను పట్టారు"