ETV Bharat / state

Huge donation sbi: బంజారాహిల్స్ రోటరీ క్లబ్​కు ఎస్బీఐ భారీ విరాళం

Huge donation sbi: పేద, బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలుస్తూ సేవలందిస్తున్న సంస్థలకు సహాయం అందించడానికి ఎస్బీఐ ముందుంటుందని సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బంజారాహిల్స్ స్పర్శ్ హాస్పిస్ స్వచ్ఛంద సంస్థకు భారీ విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SBI officials presenting checks to Rotary Club members
రోటరీ క్లబ్ సభ్యులకు చెక్కును అందిస్తున్న ఎస్బీఐ అధికారులు
author img

By

Published : Mar 12, 2022, 5:23 PM IST

Huge donation sbi: హైదరాబాద్ బంజారాహిల్స్ స్పర్శ్ హాస్పిస్ స్వచ్ఛంద సంస్థకు ఎస్బీఐ భారీ విరాళం అందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.3.13కోట్ల చెక్కును విరాళంగా ఇచ్చారు. బంజారాహిల్స్ రోటరీ క్లబ్ ఛారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో హాస్పిస్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తుంది. క్యాన్సర్ వ్యాధికి గురై చివరి దశకు చేరుకున్న 170 మంది పేదలకు సేవలు అందిస్తున్నారు.

SBI officials presenting checks to Rotary Club members
రోటరీ క్లబ్ సభ్యులకు చెక్కును అందిస్తున్న ఎస్బీఐ అధికారులు

ఈ సేవలను మరింత విస్తరించేందుకు రోగుల ఇంటివద్దే సేవలు అందించేందుకు ఈ డబ్బును వినియోగించాలని ఓం ప్రకాష్ మిశ్రా కోరారు. మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసుకుని మల్టీ డిసిప్లేనరీ టీమ్స్ నియమించుకుని సంస్థ సేవలు కొనసాగించాలని ఆయన సూచించారు.

దుర్భర పరిస్థితుల్లో ఉన్న పేద, బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలుస్తూ సేవలందిస్తున్న సంస్థలకు తమ బ్యాంకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని మిశ్రా స్పష్టం చేశారు. అదేవిధంగా సమాజంలో అట్టడుగు వర్గాల సామాజిక, ఆర్థిక స్తోమతలను మెరుగు పరచేందుకు ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతున్నామని ఓం ప్రకాష్ మిశ్రా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు అధికారులు, స్వచ్చందసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: OU Lands: హైదరాబాద్‌లో ఎకరా భూమి లీజుకు ఏడాదికి ఒక్క రూపాయే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.