ETV Bharat / state

వరదసాయం కోసం క్యూలు కడుతున్న దరఖాస్తుదారులు - హైదరాబాద్​లో వరద బాధితులు

భారీ వర్షాలతో ముంపునకు గురైన నగరవాసులకు రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం పంపిణీ కార్యాక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. సోమవారం ఒక్కరోజే 36 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో... దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు.

huge-crowd-at-mee-seva-centers-with-flood-victims-in-hyderabad
వరదసాయం కోసం క్యూలు కడుతున్న దరఖాస్తుదారులు
author img

By

Published : Nov 17, 2020, 1:21 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇటీవలి భారీ వర్షాలతో ముంపునకు గురైన కుటుంబాలకు వరద సాయం పంపిణీ తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఒక్కరోజే 36 వేల కుటుంబాలకు వరదసాయం జమ చేశారు. మీసేవ కేంద్రాలద్వారా బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు... ముంపునకు గురైన ఇంటి లొకేషన్‌, ఆధార్‌ నంబర్‌ ఆధారంగా అర్హులను గుర్తిస్తున్నారు. అనంతరం నేరుగా వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేస్తున్నారు.

వరద బాధితుల నుంచి వరుసగా వస్తున్న విజ్ఞప్తుల మేరకు వెంటనే వరద సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజమైన బాధితులు మీ-సేవ కేంద్రాల ద్వారా వివరాలు తెలియజేస్తే అధికారులు పరిశీలించి సహాయం అందజేస్తారని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అవసరమైతే మరో వందకోట్లు అయినా విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నామని.. బాధితుడి పేరు, ఇంటి నంబర్‌, ప్రాంతం, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌కార్డు, పిన్‌కోడ్‌ తదితర వివరాలతో బాధితులు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెల్లువెత్తిన దరఖాస్తులు

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో కొనసాగుతున్న ఈ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం పక్కాగా నిర్వహిస్తున్నది. దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల్లో తమ వివరాలతోపాటు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్లు నమోదు చేస్తున్నారు. దీంతోపాటు ఇంటి లోకేషన్‌ను కూడా అందులో షేర్‌ చేస్తున్నారు. వివరాలన్నీ పక్కాగా ఉన్న దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదవుతుండటంతో అర్హులను గుర్తించడం అధికారులకు సులభమవుతున్నది.

దరఖాస్తుతోపాటు ఇంటి లోకేషన్‌ ఉండటంతో అధికారులు ఆ ప్రాంతంలో నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని ముంపునకు గురైన ప్రాంతంమా? లేదా? అని గుర్తిస్తున్నారు. ఆధార్‌ నంబర్‌ ద్వారా గతంలో వరద సాయం పొందినది, లేనిది నిర్ధరించుకుంటున్నారు. ఇలా ఆమోదం పొందిన దరఖాస్తులు నేరుగా ఆర్థికశాఖకు చేరుతుండటంతో అక్కడ్నుంచే దరఖాస్తుదారుడి బ్యాంకు అకౌంట్లలోకి రూ.10వేల ఆర్థికసాయాన్ని జమ చేస్తున్నారు.

ఇదీ చూడండి: వరద బాధితులతో కిక్కిరిసిన మీ సేవ కేంద్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.