కరోనా వైరస్ ప్రభావంతో నగరంలోని ఔషధ దుకాణాలు రద్దీగా మారాయి. హైదరబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన షాపు యజమానులు కోఠిలోని హోల్‌సేల్ షాపు ముందు బారులు తీరారు. వైరస్ భయంతో నగరంలో రహదారులపై రద్దీ తగ్గిన్నప్పటికీ... కోఠిలోని ఇందర్ బాగ్లో ఔషధ దుకాణాలు మాత్రం సందడిని తలపిస్తున్నాయి.
హోల్ సెల్ అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న కోఠిలోని మెడికల్ షాపులు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కోసం తాము క్లిష్ట పరిస్థితిల్లో మందులు విక్రయిస్తున్నామని యజమానులు చెబుతున్నారు. కానీ తమకు ఎలాంటి ఆరోగ్య భద్రత లేదని వారు వాపోయారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి మందులు కొనుగోలుకు వచ్చే వాహనాదారులు వాగ్వాదానికి దిగుతున్నారు.