ETV Bharat / state

lorry challans at ap ts boarder: బోర్డర్​ దాటాలంటే భయమేస్తోంది.. పర్మిట్ కష్టాలు తీరేదెప్పుడు..? - ేపీ తెలంగాణ సరిహద్దులో భారీ చలాన్లు

lorry challans ap ts boarder: ఉత్పత్తి, డిమాండ్‌కు మధ్యలో వారధిగా నిలిచేది రవాణా రంగం. సరుకులను ఓ చోట నుంచి మరో చోటకు బట్వాడా చేస్తేనే... మార్కెట్‌ మనుగడ సాగిస్తుంది. ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తాయి..లారీలు. రాష్ట్రాల సరిహద్దులు దాటి భారీ మొత్తంలో సరుకులను రవాణా చేస్తుంటాయి. కరోనా సమయంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఈ పరిశ్రమ... ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఆంక్షలు, నిబంధనలు తొలగిపోయాయనుకుంటే... ఇప్పుడు మరో సమస్య.. తెలుగు రాష్ట్రాల లారీ పరిశ్రమ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తోంది. సరకు రవాణా చేసే క్రమంలో... ఏపీ-తెలంగాణ సరిహద్దు దాటితే చాలు.. చలాన్ల వడ్డన మొదలవుతోంది. ఒక్కో ట్రిప్పునకు వేలాది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి సింగిల్ పర్మిట్ ఇవ్వాలని కోరుతున్నా... ఇంత వరకూ రెండు ప్రభుత్వాలూ ఆ ఊసే ఎత్తలేదు. ఫలితంగా...ఆదాయంలో ఎక్కువ భాగం చలాన్ల చెల్లింపులకే ఖర్చవుతోందంటున్నాయి...లారీ యజమానుల సంఘాలు.

lorry owners
lorry owners
author img

By

Published : Dec 1, 2021, 2:51 PM IST

బోర్డర్​ దాటాలంటే భయమేస్తోంది.. పర్మిట్ కష్టాలు తీరేదెప్పుడు..?

lorry challans ap ts boarder: రోడ్డు రవాణాలో లారీలదే కీలక పాత్ర. నిత్యం వందలాది లారీలు తెలుగు రాష్ట్రాల్లో అటు నుంచి ఇటు నుంచి సరకు బట్వాడా చేస్తుంటాయి. కూరగాయలు, పండ్లు సహా ఇంకెన్నో నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తాయి. లాభాల బాటలో పయనిస్తున్న లారీ పరిశ్రమను ఒక్కసారిగా కుంగదీసింది... కరోనా సంక్షోభం. ఈ విపత్కర సమయంలో చాలా లారీలు షెడ్లకే పరిమితమయ్యాయి. కొవిడ్ క్రమంగా తగ్గినా.. కొన్ని చోట్ల చాలా రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ అమలు... లారీ యజమానులకు గుదిబండలా మారింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పూర్తిగా ఉత్పత్తి తగ్గించడం వల్ల.. సరుకు రవాణా లేక లారీ యజమానులు సతమతమయ్యారు. భారీ స్థాయిలో రవాణా మెుత్తం రైల్వే శాఖకు వెళ్లటం.. మరింత ఇబ్బందులకు గురిచేసింది. తర్వాత క్రమంగా ఆంక్షలు ఎత్తివేయటం వల్ల మళ్లీ గాడిన పడింది ఈ పరిశ్రమ. కానీ...ఇప్పుడు చలాన్ల రూపంలో మరో సమస్య లారీ యజమానులను కలవరపెడుతోంది.

సరిహద్దు దాటాలంటే వణుకు

lorry owners struggles in telangana: నిత్యం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో ప్రజా, సరుకు రవాణా జరగడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం సరిహద్దు దాటాలంటే లారీ నిర్వాహకులు వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ట్రిప్పునకు సుమారు 2వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి రావటం. ఏడాదికి ఒక్కో లారీ నిర్వాహకుడు 80వేల రూపాయల పైచిలుకు చెల్లించాల్సి వస్తోంది. కరోనా గండం దాటి... నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నామన్న ఆనందం అదనపు చెల్లింపులతో ఆవిరైపోతోంది. డీజిల్ ధరల పెరుగుదలతోనే ఆర్థిక భారం పెరుగుతోంది అనుకుంటే... చలాన్ల వడ్డనతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఏడేళ్లుగా రెండు రాష్ట్రాల రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా... ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడకు వెళ్తే మరో 2వేలు చెల్లించాల్సిందే..

Counter Signature Permit : తెలంగాణలో సుమారు 5లక్షల 60వేల సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 1,75,000 భారీ వాహనాలు ఉన్నాయి. ఈ భారీ వాహనాల్లో సుమారు 75వేల నుంచి 90వేల వరకు పాతవే. నిత్యం పాలు, కూరగాయలు, ఇసుక, సిమెంట్, ఇనుము, కంకర వంటి వాటిని లారీల నిర్వాహకులు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. పొరుగు రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. పొరుగు రాష్ట్రంలో తిరిగేందుకు 5వేల రూపాయలు చెల్లిస్తే.. ఏడాది పొడవునా తిరిగే వెసులుబాటు ఉంటుంది. దాన్నే కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్​గా పేర్కొంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు ఇదే విధంగా 5వేల రూపాయలు చెల్లించి లారీ నిర్వాహకులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ..రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్తే...అదనంగా 2వేలు చెల్లించాల్సి వస్తోంది.

కొలిక్కిరాని ఒప్పందం

Single permit : దేశంలో ప్రతీ రాష్ట్రంలోని వాహనాలు వివిధ పనుల రీత్యా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా రాష్ట్ర సరిహద్దు దాటిన ప్రతిసారి కనీసం...15 వందల వరకు చలానా కడతారు. ఇలా రోజూ రాకపోకలు సాగించే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి వాహనాల కోసం పొరుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటాయి. దాన్నే సింగిల్‌ పర్మిట్‌ విధానం అంటారు. దీని ప్రకారం.. ఒక వాహనం తరచుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏటా 5 వేలు చెల్లిస్తే చాలు. ఏడాది పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో భాగంగా తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో ఒప్పందం చేసుకుంది. కానీ ఏపీతో మాత్రం ఇంతవరకు చేసుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సింగిల్‌ పర్మిట్‌ అంశం ఎన్నో ఏళ్లుగా నలుగుతూనే ఉంది. ఫలితంగా...లారీ యజమానులకు అదనపు చెల్లింపుల బాధ తప్పటం లేదు.

ఏ పక్కకు వెళ్లినా అదే బాదుడు

ap telangana boarder charges: రోజూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లి రావాలంటే.. వేలకు వేలు చలానా కడుతున్నారు లారీల యజమానులు. ఆ ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా... రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సింగిల్ పర్మిట్ విధానంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. కోదాడ నుంచి చిల్లకల్లు పోయి రావాలంటే.. సింగిల్ ట్రిప్‌నకు 1,600లు కట్టాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మూడు నుంచి నాలుగు వందల ఖర్చు ఉంటోంది. ఈ విధంగా ప్రతి ట్రిప్‌నకు రెండువేల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. మహబూబ్​నగర్ నుంచి కర్నూల్​కు వెళ్లి రావాలంటే సరిహద్దు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం...ఒక్క ట్రిప్‌నకు 2వేల వరకు అదనంగా ఖర్చవుతోంది.

తెలంగాణలో 60 శాతం వరకు ఓనర్​ కం డ్రైవర్లు ఉన్నారు. ఎక్కువ పాత వాహనాలు ఉన్నాయి. వారికి కచ్చితంగా సింగిల్ పర్మిట్​​ కౌంటర్​ సిగ్నేటర్​ పర్మిట్​ అవసరం ఉంటుంది. అవి లేకపోవడం వల్ల అదనంగా ప్రతి ట్రిప్పుకు రూ. 2వేలు ఖర్చవుతోంది. - రాజేందర్​ రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు

ఏడాదికి ఎనిమిది వేలా...!

నల్గొండ నుంచి విజయవాడకు ఒక ట్రిప్పు వెళ్లాలంటే 8-10వేల వరకు రవాణా చార్జీలు వసూలు చేస్తారు. ఇందులో 5-6 వేల వరకు డీజిల్​కే ఖర్చవుతుంది. టోల్ గేట్లకు 1,500 చెల్లించాల్సి ఉంటుంది. లోడింగ్-అన్ లోడింగ్​కు 3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ పోనూ డ్రైవర్ కం ఓనర్ అయితే.. ఒక ట్రిప్పునకు 2 నుంచి 3వేల వరకు మిగులుతుంది. ఇప్పుడు అంతరాష్ట్ర రవాణా ఒప్పందం జరగకపోవడం వల్ల వెయ్యి రూపాయలు కూడా మిగలడం లేదంటున్నారు. ఏడేళ్లుగా...సింగిల్ పర్మిట్ విధానం కోసం లారీ నిర్వాహకులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. 2019 ఫిబ్రవరి 13న అంతరాష్ట్ర రవాణా ఒప్పందం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ లేఖ ఇచ్చింది. గతంలో ఉన్నటువంటి 5 వేల రుసుముకు బదులు 8వేలు చెల్లించి ఏడాది పొడవునా సరుకు రవాణా వాహనాలకు కౌంటర్ సిగ్నిచర్ పర్మిట్ తీసుకోవచ్చని లేఖ రాశారు. కానీ..అందుకు లారీ నిర్వాహకులు అంగీకరించలేదు.

ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులకు ఈ సమస్యను విన్నవించుకున్నాం. ఏడేళ్లుగా మా సమస్య పరిష్కారం కాలేదు. టెంపరరీ పర్మిట్​కు భారీగా వడ్డన పడుతోంది. -వైవీ ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్​ అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి

ఆ సమస్య వల్ల సరిహద్దు దాటలేకపోతున్నారు

ఏపీలో ఉన్న లారీల్లో చాలా వాటికి రిజిస్ట్రేషన్‌ సమయంలోనే నేషనల్‌ పర్మిట్‌ తీసుకున్నారు. వారి లారీలు తెలంగాణకు సులువుగానే రాగలుగుతున్నాయి. కానీ...పలు తెలంగాణ లారీలకు నేషనల్‌ పర్మిట్‌ లేదు. వీళ్లు ఆంధ్రా సరిహద్దు దాటిన ప్రతీసారి 1,500 చెల్లించాల్సి వస్తోంది. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో 2008 నుంచి ఇదే విధంగా 5వేలు చెల్లించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ తీసుకుంటున్నామని లారీ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ.. తెలంగాణలో మాత్రం ఇంకా అమలు కావడం లేదు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నడపాల్సిన లారీలను ఎక్కడిక్కడ నిలిపివేసి.. పొరుగు రాష్ట్రం పోలేక అడ్డాపై ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది.

ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైనా పూర్తిగా నాశనం అయ్యారంటే లారీ ఓనర్లు మాత్రమే. ఏపీలో ఎక్కువ లారీలకు నేషనల్​ పర్మిట్​ ఉంటుంది. తెలంగాణలో తక్కువ. ఇవాళ సింగల్​ పర్మిట్​కు రూ. 2వేలు ఖర్చవుతోంది. ఏడాదికి అదనంగా రూ.84 వేలు అవుతోంది. -చాంద్ పాషా, తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధానకార్యదర్శి

ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని...తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రికి లేఖ రాశారు. లారీ నిర్వాహకులు ఆ లేఖలోని అంశాలు ప్రస్తావిస్తూ...సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయమై ఐదారేళ్లలో రెండుసార్లు సమ్మె చేసినప్పటికీ... ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 60శాతం ఓనర్ కం డ్రైవర్లుగానే ఉన్నారు. ఫలితంగా...ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా కనిపిస్తోంది.

అప్పటి వరకు తప్పదు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రవాణా రంగం నుంచి అత్యధికంగా పన్ను చెల్లింపులు జరుగు తున్నాయి. అయినా...తమ సమస్యలపై దృష్టి సారించటం లేదన్న అసంతృప్తి లారీ యజమానుల్లో కనిపిస్తోంది. సింగిల్ పర్మిట్ విధానంపై అనేక దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాలాభం లేకుండా పోయింది. ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ...లారీ యజమానులు... అదనపు భారాన్ని మోయక తప్పేలా లేదు.

ఇదీ చూడండి: paddy procurement: నెలల తరబడి పడిగాపులే.. కర్షకులకు తప్పని కన్నీరు

Universities fees : ప్రభుత్వ వర్సిటీల్లోనూ భారమవుతోన్న చదువులు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.