రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలకు రెట్టింపు, అంతకంటే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నట్లు దుకాణదారులు వెల్లడించారు. మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది బారులు తీరడం వల్ల సాయంత్రం నాలుగైదు గంటలకే దుకాణాల్లో మద్యం నిల్వలు ఖాళీ అయ్యాయి. ఎక్కువ మంది 5 నుంచి 10 బాటిళ్లు కొనడం వల్ల అధిక విక్రయాలు జరిగినట్లు దుకాణదారులు తెలిపారు.
ఇక జిల్లాల వారీగా తీసుకుంటే.. హైదరాబాద్లో రూ.30కోట్లు, రంగారెడ్డిలో రూ.55 కోట్లు, ఆదిలాబాద్లో రూ.19 కోట్లు, కరీంనగర్లో రూ.26కోట్లు, ఖమ్మంలో రూ.21కోట్లు, మహబూబ్నగర్లో రూ.22కోట్లు, మెదక్లో రూ.23కోట్లు, మేడ్చల్లో రూ. 5.5కోట్లు, నల్గొండలో రూ.24కోట్లు, నిజామాబాద్లో రూ.9 కోట్లు, వరంగల్లో రూ.16కోట్ల లెక్కన మద్యం అమ్ముడుపోయింది. కేవలం 2 రోజుల్లోనే 2.96 లక్షల కేసుల లిక్కర్, 22.10 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఫలితంగా 2 రోజుల్లో రూ. 260 కోట్ల విలువైన మద్యాన్ని లైసెన్సుదారులు బేవరేజ్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేశారు.