తెదేపా నేత మృతిపై ఈనాడు-ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సకాలంలో వైద్యం అందక హైదరాబాద్ సనత్‌నగర్‌కు చెందిన తెదేపా నేత పి.రామ్ కుమార్ మృతి చెందిన ఘటన ఈనాడు- ఈటీవీ భారత్‌లో 'ఆసుపత్రులన్నీ తిరిగేలోపే..' శీర్షికన ప్రచురితమైంది.
ఈ కథనంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సూమోటోగా కేసును స్వీకరించింది. ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరో... అసలేం జరిగిందో లోతుగా విచారణ జరిపి ఆగస్టు 21 లోపు నివేదిక సమర్పించాలని ఛాతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది.