హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన మహిళాదినోత్సాలకు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య విచ్చేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు, స్థానికులు తమ బస్తీల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన వద్ద వాపోయారు. కార్యక్రమం అనంతరం ఆయన ఓయూ క్యాంపస్ బస్తీల్లో పర్యటించారు.
క్యాంపస్లో 9 క్యాంప్ బస్తీలు ఉన్నాయని.. సుమారు 15వేల మంది ప్రజలు అక్కడి నివసిస్తున్నామని ఆయనకు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే పలు విభాగాల్లో తాము పనిచేస్తున్నామని చెప్పారు. స్వీపర్ పని నుంచి వంటపని వరకు కింది స్థాయి ఉద్యోగులందరూ క్యాంపు బస్తీలలో నివాసముంటున్నామని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు ఆయనకు బస్తీలలో ఉన్న ఇబ్బందుల గురించి వివరించారు
దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రయ్య పూర్తి సమస్యలు రాసి తనకు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం, ఓయూ అధికారుల కమిటీ ఆధ్వర్యంలో సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
ఇదీ చూడండి:ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు